Wednesday, December 06, 2006

కాలం!

కాలమెపుడూ పరిగెడుతూనే వుంటుంది.
నువ్వు విశ్రాంతి తీసుకుంటానంటే
తనాగిపోదు.
కాలమెపుడూ మారుతూనే వుంటుంది.
నువ్వు ఒకేలా వుంటానంటే
తనూరుకోదు.
కాలమెపుడూ ముందుకే పయనిస్తుంటుంది.
నువ్వు గతపు తీపి జ్ఞాపకాల్లోనే జీవిస్తానంటే
తను సహించదు.

కాలమిన్ని చెప్పినా నువ్వు లెక్క చేయక,
కలకాలం యిలానే ఉంటానంటే,
నీ సమకాలం నిన్ను వెలేస్తుంది!
నీ సమాజం నిన్ను బలిస్తుంది!

అందుకే;
మాటాడగలిగీ మాటాడలేని,
చెప్పగలిగీ చెప్పలేని,
చేయగలిగీ చేయలేని,
ఓ సమర్థాసమర్థ యువకా!

కాలంతో సాగిపో!
కాలంలా మారిపో!
ప్రతి కాలంలో నిలిచిపో!!

3 comments:

ఆసా said...

బాగు౦ద౦డి.. మీ కవితలలో యువత ఉడుకు రక్త౦ వెతకనవసర౦ లేకు౦డా కనిపిస్తు౦ది. నాకు నా కాలేజీ రోజులు గుర్తుకువచ్చాయి. కాల౦తో పాటు ఆలోచన విదాన౦ మారుతు౦దనుకొ౦డి.
ఇలానే ఇ౦కా మీ కల౦ను ఝుళిపి౦చ౦డి.
అభిన౦దనలు..:)
సాయి.

రాధిక said...

chaalaa bagundi.marinni aasistunnamu mii numdi

వెంకట పవన్ కుమార్ said...

కవిత చాలా బాగుంది.